Sunday, October 6, 2024

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్.. కంగ్రాట్స్ బ్రదర్‌ అంటూ కేటీఆర్..

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎంపిక కావడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. బెంగళూరులోని ఎన్‌సీఏ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా కొత్త బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. లక్ష్మణ్, రాహుల్‌ ద్రవిడ్‌ సారధ్యంలో భారత క్రికెట్‌ మరింత గొప్పగా, అద్భుతంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకం నాకుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌ ను టీమిండియా కోచ్‌గా నియామకం అయ్యారు. దీంతో ఎన్‌సీఏ డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement