Wednesday, May 1, 2024

64 పరుగులకే కుప్పకూలిన గుజరాత్… 143 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. డీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో 143 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. 208 ప‌రుగుల‌ భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ జెయింట్స్ 64కే ఆలౌట్ అయింది. . 208 ప‌రుగుల‌ భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ జెయింట్స్ 64కే ఆలౌట్ అయింది. ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దాంతో గుజ‌రాత్ ఏ ద‌శ‌లోనూ పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. వ‌చ్చిన వాళ్లు వ‌చ్చిన‌ట్టూ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఆ జ‌ట్టులో ద‌య‌లాన్ హేమ‌ల‌త టాప్ స్కోర‌ర్‌. హేమ‌ల‌త, మ‌న్సీ జోషి (6) ఎనిమిదో వికెట్‌కు 26 ర‌న్స్ జోడించారు. ముంబై బౌల‌ర‌ల్లో సాయిక ఇష‌క్ నాలుగు, అమేలియా, నాట్ సీవ‌ర్ బ్రంట్ త‌లా రెండు వికెట్లు తీశారు. ఇసీ వాంగ్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

అంతకుముందు టాస్ ఓడిపోయి మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ ముంబై ఇండియ‌న్స్ ఐదు వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెల‌రేగింది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ తొలి మ్యాచ్‌లో హ‌ర్మ‌న్‌ప్రీత్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీ న‌మోదు చేసింది. 22 బంతుల్లోనే అర్ధ శ‌త‌కానికి చేరువైంది. గ్యాప్స్‌లో బౌండ‌రీలు కొడుతూ గుజ‌రాత్ జెయింట్స్ బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డింది. అమేలియాతో క‌లిసి హ‌ర్మ‌న్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 89 ప‌రుగులు జోడించింది. 15 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయిన ముంబైని నాట్ హేలీ మ్యాథ్యూస్ (47) , నాట్ సీవ‌ర్ బ్రంట్ (23) ఆదుకున్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 54 ర‌న్స్ చేశారు.  అమేలియా కేర్ (45), పూజా వ‌స్త్రాక‌ర్ (15) ధాటిగా ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో స్నేహ్ రానా రెండు, త‌నూజ క‌న్వ‌ర్, జార్జియా వారేహ‌మ్‌, అషే గార్డ్‌న‌ర్ త‌లా ఒక‌ వికెట్ తీశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement