Tuesday, May 7, 2024

ట్రైన‌ర్ పై హృతిక్ రోష‌న్ పొగ‌డ్త‌లు

త‌న ట్రైన‌ర్ ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్. త‌న ట్రైన‌ర్ ని పొడగ్తలతో ముంచెత్తాడు. హృతిక్. ఫైటర్ సినిమాలో పర్‌ఫెక్ట్‌ ఫైటర్‌ బాడీ కోసం హృతిక్‌ ఇంకాస్త అదనపు కసరత్తులు చేశాడు. ఈ క్రమంలో తనకు ట్రైనింగ్ ఇచ్చిన జిమ్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తిరిగి తన సొంత దేశానికి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆయనని ఉద్దేశించి హృతిక్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పని పట్ల శ్రద్ధ, నిబద్దత కలిగిన మీ లాంటి వారిని చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది. నిజానికి ప్రపంచానికి మీ లాంటి వారే కావాలి, మీకోసం ఎదురుచూస్తుంటాను ఎమోషనల్ పోస్ట్‌ రాసుకొచ్చాడు హృతిక్‌. ఎంతో ప్రేమతో హృతిక్‌ రోషన్ పెట్టిన పోస్ట్‌కు అతని జిమ్ ట్రైయినర్ క్రిస్‌ గెతిన్ కూడా అంతే ప్రేమగా స్పందించాడు. హృతిక్.. ది ఫైటర్ అంటూ రిప్లై ఇచ్చాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఫైటర్‌ లో హృతిక్ జోడీగా దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నారు టీమ్. ఈ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు స్టార్ హీరో.

Advertisement

తాజా వార్తలు

Advertisement