Thursday, April 25, 2024

బీబీఎల్‌లోకి సూర్య వస్తే తిప్పలు తప్పవ్.. నయా 360పై మ్యాక్స్‌వెల్‌ ఫన్నీ కామెంట్స్

టీ20 క్రికెట్‌లో భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నయా 360 సూర్యకుమార్‌ యాదవ్‌ తన కెరీర్‌లోనే సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించగా, న్యూజిలాండ్‌ పర్యటనలోనూ రాణించాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ ఆటపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రశంసలు కురిపించాడు. సూర్య ఆట మాటలకు అందడం లేదని.. అతడు వేరే ప్లానెట్‌ నుంచి వచ్చినట్టుగా ఆడుతున్నాడని కొనియాడాడు.

అంతేగాక అతడే గనక బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లోకి వస్తే తమ క్రికెట్‌ బోర్డుకు తిప్పలు తప్పవని ఫన్నీగా చెప్పాడు. మా దగ్గర అన్ని డబ్బుల్లేవు. అసలు ఆ అవకాశమే లేదు. ఒకవేళ సూర్య గనక బీబీఎల్‌లో ఆడాల్సి వస్తే క్రికెట్‌ ఆస్ట్రేలియా తన కాంట్రాక్టు ఉన్న ప్లేయర్లందరినీ వదులుకోవాలని అని ఫన్నీగా పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement