Friday, May 3, 2024

Aussis World Cup team | అగ‌ర్ ఔట్.. మార్నస్‌ లబుషేన్ జాక్‌పాట్‌..

ఆసీస్‌ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జట్టులో ప‌లు మార్పులు చేసిన‌ట్టు ప్రకటించింది. పదిహేను మందితో కూడిన ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేశామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతకు ముందు ప్రకటించిన జట్టులో ఒకే ఒక మార్పు చేస్తున్నామని పేర్కొంది. గాయపడ్డ ఏస్టన్‌ ఆగర్‌ స్థానంలో లబుషేన్‌కు చోటిచ్చామని వెల్లడించింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనప్పటికీ ట్రావిడ్‌ హెడ్‌ తన స్థానం పదిలం చేసుకున్నాడు. టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి మధ్యలో అతడు అందబాటులో వస్తాడని ఆసీస్‌ ధీమా వ్యక్తం చేసింది.

ఆస్ట్రేలియా సెప్టెంబర్‌ 6న వన్డే ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది. ఇద్దరు ప్రధాన స్పిన్నర్ల కోటాలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఏస్టన్‌ ఆగర్‌ చోటు దక్కించుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ సిరీసు నుంచి అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరాన్‌ గ్రీన్‌, సేన్‌ అబాట్‌, అలెక్స్‌ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టాయినిస్‌, ఆడమ్‌ జంపా

- Advertisement -

అంతకు ముందు ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్ రౌండర్ అక్షర్‌ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో వేరే ఆలోచన లేకుండా గాయం కారణంగా జట్టుకు దూరమైన అక్షర్ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement