Sunday, April 28, 2024

లీచెస్టర్‌- భారత్‌ వార్మప్‌ మ్యాచ్ లో.. రాణించిన భరత్‌

ఇంగ్లండ్‌తో జులై 1న జరగబోయే రీషెడ్యూల్‌ చేసిన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌కోసం సన్నద్ధమవుతున్న భారత్‌ జట్టు గురువారం ఎడ్గ్‌బాస్టన్‌లో లీచెస్టర్‌ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌లో తలపడింది. నాలుగు రోజుల ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు తీవ్ర కసరత్తు చేసింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆట ప్రారంభంలోనే లీచెస్టర్‌ బౌలర్‌ ప్రసిధ్‌ కృష్ణ భారత్‌ను దెబ్బతీశారు. త్వరత్వరగా 2వికెట్లు కోల్పోయిన భారత్‌ 54 పరుగులు శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 11 బంతులు ఆడిన అయ్యర్‌ పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా విఫలమయ్యారు. అయితే భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ, భరత్‌ తో కలసి స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు.

ఇద్దరూ కలసి ఐదో వికెట్‌కు స్కోరు బాగా పెంచారు. ఈ మ్యాచ్‌లో ధాటీగా ఆడుతున్న కె.ఎస్‌. భరత్‌ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 55 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి 246 పరుగులు చేసిన భారత్‌ నిలకడగా ఆడుతోంది. కాగా కోవిడ్‌ బారిన పడిన స్టార్‌ స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌ ఎట్టకేలకు ఇంగ్లండ్‌ చేరుకున్నారు. లీచెస్టర్‌ జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఆయన పాల్గొన్నారు. భారత జట్టులో స్టార్‌ ఆటగాళ్లయిన ఛతేశ్వర్‌ పుజారా, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిథ్‌ కృష్ణ లీచెస్టర్‌ శామ్‌ ఇవాన్స్‌ నాయకత్వంలోని లీచెష్టర్‌ జట్టులో ఆడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement