Sunday, April 28, 2024

KKR vs DC – కె కె అర్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి

విశాఖ – 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డి సి 166 పరుగులకు కుప్ప కూలింది. 106 పరుగుల తేడాతో కె కె అర్ డి సి పై ఘన విజయం సాధించింది కాగా డి సి కి ఆది లోనే ఎదురు దెబ్బ తగిలింది. 10 పరుగులు చేసి పృధ్వీ షా ఔట్ కాగా మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. పోరెల్ కూడా సున్నా కి పెవీలియన్ కు చేరాడు .. 21 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. రిషబ్ 55, స్టబ్స్ 54 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్స్ తక్కువ పరుగులకీ ఔట్ అయ్యారు.

కెకెఅర్ బౌలర్ల లో వైభవ్, వరుణ్ లు మూడేసి వికెట్లు పడగొట్టారుమార్ష్ కు రెండు వికెట్లు దక్కాయి

. అంతకు ముందు విశాఖ స్టేడియంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిసింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెల‌రేగారు. దొరికిన బంతిని దొరిక‌న‌ట్టు స్టాండ్స్‌లోకి పంపారు. రెండు గంట‌ల పాటు ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కొన‌సాగించారు. దాంతో, వైజాగ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్ల(15) రికార్డు కొట్టుకుపోయింది. హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కోల్‌క‌తా నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగుల స్కోర్ కొట్టింది. త‌ద్వారా ఐపీఎల్‌లో అత్య‌ధిక స్కోర్ బాదిన రెండో జ‌ట్టుగా కోల్‌క‌తా చ‌రిత్ర సృష్టించింది.మొద‌ట‌ ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(85) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా… అరంగేట్ర కుర్రాడు అంగ్‌క్రిష్ రాఘువంశీ(54) ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. కోల్‌క‌తా బ్యాట‌ర్ల వీర‌బాదుడు చూశాక ఐపీఎల్ రికార్డు స్కోర్ 277 బ‌ద్ధ‌లవుతుంది అనిపించింది. కానీ, ఢిల్లీ బౌల‌ర్లు చివ‌ర్లో అద్భుతంగా కోల్‌క‌తా హిట్ట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement