Saturday, May 18, 2024

జూ. వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌.. 26 మందితో భారత బృందం

రేప‌టినుంచి అర్మేనియాలోని యెరెవాన్‌లో ప్రారంభమయ్యే ఐబిఎ జూనియర్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 26 మంది సభ్యులతో కూడిన బలమైన బృందం భారతదేశానికి ప్రాతినిధ్యం వ#హస్తుంది. డిసెంబర్‌ 4వరకు కొనసాగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ జూనియర్‌ బాక్సింగ్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

26 వెయిట్‌ కేటగిరీలలో 58దేశాల నుండి 448 మంది యువ ప్రతిభావంతులు సత్తా చాటేందుకు అర్మేనియా చేరుకున్నారు. 2023 ఆసియన్‌ యూత్‌, జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో ఇటీవలి అద్భుత ప్రదర్శనల తర్వాత భారతీయ జూనియర్‌ స్క్వాడ్‌ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇందులో బాలికల విభాగంలో 13, బాలుర విభాగంలో 8 పతకాలు గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement