Monday, April 29, 2024

బూమ్..బుమ్రా స్టెప్పులు..

టీమ్‌ ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరిగే బంతులేయడం, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపడం మనం ఇన్నాళ్లూ చూశాం. కానీ, అతడికి డ్యాన్స్ చేయడం, పాటకు తగ్గట్లు స్టెప్పులేయడం కూడా వచ్చనే విషయం ఇప్పుడే బయటకి వచ్చింది. స్పోర్ట్స్ ఛానల్ కామెంటేటర్ సంజన గణేశన్‌ను మ్యారెజ్ చేసుకున్న బుమ్రా సంగీత్‌ కార్యక్రమంలో తన ప్రియసఖితో కలిసి ఆడిపాడాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సంజనతో పెళ్లి ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు బుమ్రా. దీంతో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి..

https://youtube.com/watch?v=zsmWcDT59vQ
YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement