Monday, May 6, 2024

శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో వెస్టీండీస్‌ వన్డేకు భారత్‌ టీమ్‌ సిద్ధం..

వెస్టీండీస్‌ వన్డే ఫేవరేట్‌గా ధావన్‌ సేన సమరానికి సిద్ధమైంది. సీనియర్‌ ప్లేయర్స్‌ లేకుండానే బరిలోకి దించిన బీసీసీఐ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముచేయకుండా గెలుపొందేలా కసరత్తు ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ బెస్ట్‌ టీమ్‌గా రాణిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌ విజయవంతంగా రాణిస్తోంది. టీ20 షెడ్యూల్‌ కూడా ఇదే సంవత్సరం ఉండటంతో ఈ విజయం మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. వెస్టీండీస్‌ టీమ్‌లో ప్రధాన ప్లేయర్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా, బూమ్రాలు వంటి మహామహులు లేకుండా భారత్‌ టీమ్‌ శుక్రవారం నుంచి వన్డేకు సిద్ధమైంది. వన్డే మ్యాచ్‌లలో ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ ఇదే సంవత్సరంలో వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీగా ఏడు మ్యాచ్‌లను లీడ్‌ చేశాడు. ప్రస్తుతం వెస్టీండీస్‌కు శిఖర్‌ధావన్‌ నేతృత్వంలోనే వన్డే మ్యాచ్‌కు భారత్‌ టీమ్‌ సిద్ధమైంది. ప్రధాన ఆటగాళ్లు లేక సతమతమవుతున్న వెస్టీండీస్‌ టీమ్‌కు భారత్‌ టీమ్‌ మాత్రం కొత్త ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతోంది.

ఇందులో ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌, సుబమన్‌, సన్‌జు, శ్రేయస్‌, దీపక్‌ హుడాలు వన్డేలో తమ పట్టును సాధిస్తూ వస్తున్నారు. మెరుగైన బౌలర్స్‌ లేక సతమతమవుతున్న వెస్టీండీస్‌ను భారత్‌ బౌలర్లు సులువుగా ఎదుర్కొంటారనే ధీమాతో ఉన్నారు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌కు తోడుగా రవీంద్ర జడేజా, చాహెల్‌ బౌలింగ్‌పై బోర్డు నమ్మకాన్ని ఉంచింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య టీమ్‌లో లేకపోవడంతో ఆయన స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండర్‌గా దిగుతున్నాడు. అర్షదీప్‌ సింగ్‌ పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో రేపటిలోగా కోలుకోలేక పోతే ప్రసీద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అవేష్‌ ఖాన్‌లను టీమ్‌లోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలో 3-0తో వన్డేలో దెబ్బతిన్న వెస్టీండీస్‌, వైట్‌బాల్‌తో నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఆడిన వన్డేల్లో లేకుండా విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్‌ జాసన్‌ తిరిగి ఫామ్‌లోకి రావడంపై ధీమాతో ఉంది. వెస్టిండీస్‌ టీమ్‌లో ఓపెనర్లుగా షాయ్‌ హోప్‌, బ్రూక్‌, రోవన్‌ పౌల్‌, బ్రాన్‌డన్‌ కింగ్‌, కైలీ మైర్స్‌ వంటి వారి బ్యాటింగ్‌తో భారీ స్కోరును సాధిస్తేగాని భారత్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని వెస్టిండీస్‌ భావిస్తోంది. భారత్‌ టీమ్‌ నేటి నుంచి వెస్టిండీస్‌ టీమ్‌ను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement