Thursday, May 2, 2024

India -vs Ausis – గిల్ ఔట్ – భారత్ 178/3

మొహాలీ – ఆసిస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(74) మూడో వికెట్ రూపంలో అవుటయ్యాడు . ఆడం జంపా వేసిన 26వ ఓవ‌ర్లో బౌల్డ్ అయ్యాడు. .దాంతో, ఇండియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో మూడు వికెట్లు కోల్పోయింది ప్రస్తుతం రాహుల్, ఇషాన్ కిషన్ క్రీజ్ లో ఉన్నారు . 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది ..

కాగా,148 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయస్‌ అయ్యర్‌ (3) రనౌటయ్యాడు. 23.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 148/2గా ఉంది. గిల్‌ (72), రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు.

అంతకు ముందు భారత్‌142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో రుతురాజ్‌ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 147/1..

మొహాలీ స్టేడియంలో మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ ఆస్ట్రేలియా 276 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యింది. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్(52), జోష్ ఇంగ్లిస్‌(45), స్టీవ్‌ స్మిత్(41), మార్న‌స్ ల‌బూషేన్(39) మాత్ర‌మే రాణించారు. పేస‌ర్ ష‌మీ దెబ్బ‌కు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయ‌లేక‌పోయింది. తొలి స్పెల్‌లో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్‌(4), స్టీవ్ స్మిత్‌(41)ల‌ను ఔట్ చేసిన‌ ష‌మీ ఆసీస్ టాపార్డ‌ర్‌ను కూల్చాడు. ఆ త‌ర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డ‌ర్ ప‌ని ప‌ట్టాడు. డేంజ‌ర‌స్ ఆట‌గాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌల‌ర్ సియాన్ అబాట్(2)ల‌ను పెవిలియ‌న్ పంపి ష‌మీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వ‌న్డేల్లో అత‌డు ఐదు వికెట్లు తీయ‌డం ఇది రెండోసారి

Advertisement

తాజా వార్తలు

Advertisement