Tuesday, April 30, 2024

India vs Afghanistan – నేడే మొహలీలో తొలి టీ20 మ్యాచ్‌

నేడు ఇండియా , ఆఫ్ఘన్‌ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే తొలి టీ20 మొహలీ వేదికగా జరుగనుంది..తొలి టీ20లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది.

ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే చేదనలోను అదే జోరు కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే…. ఇక్కడ 6 మ్యాచులు జరిగితే నాలుగింట్లో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక భారత్ ఇక్కడ 4 టీ20ల్లో 3 నెగ్గింది. ఆస్ట్రేలియా చేతిలో 2022లో ఓడింది. ఇక ఈ మ్యాచ్‌ కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement