Friday, May 17, 2024

Badminton | జనవరి 16 నుంచి ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750

ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జనవరి 16 నుంచి 21 వరకు ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీ జరుగనుంది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత సాధించడమే లక్ష్యంగా షట్లర్లు బరిలోకి దిగనున్నారు. ఏసియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి, రజత పతక విజేత హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తమ ర్యాంక్‌లను మరింత పెంచుకోనున్నారు.

మాజీ ప్రపంచ నం.1 కిదాంబి శ్రీకార్‌, 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ లక్ష్య సేన్‌, ప్రియాన్షు రజావత్‌ తదితరులు కూడా ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750లో తమ భవితవ్యం పరీక్షించుకోనున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ రూల్స్‌ ప్రకారం, భారత్‌ తరఫున మెన్స్‌ సింగిల్స్‌ తరఫున ఇద్దరికి అవకాశముంటుంది. 2024 ఏప్రిల్‌ 30నాటికి క్వాలిఫికేషన్‌ పూర్తయ్యేనాటికి టాప్‌-16లో నిలబడిన వారికే పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత సాధిస్తారు. అందుకోసం భారత షట్లర్లు ఇండియా ఓపెన్‌ 750 టోర్నీకి సన్నద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement