Tuesday, April 30, 2024

Ind vs Eng, 5th Test : భారత్ బ్యాటర్స్ వీరవిహారం.. భారీగా లీడ్

రోహిత్, గిల్ శ‌త‌కాలు…
స‌ర్ఫ‌రాజ్, ప‌డిక్క‌ల్ అర్ధ‌శ‌త‌కాలు..
ఇంగ్లండ్ బౌల‌ర్స్ కు చుక్క‌లు..
వ‌న్డే త‌ర‌హాలో భార‌త్ బ్యాటింగ్ ..
ఇప్ప‌టికే 255 ప‌రుగుల పైగా అధీక్యం ..

ధ‌ర్మ‌శాల‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇప్ప‌టికే 255 పరుగుల లీడ్ సాధించింది.. భార‌త్ రెండో రోజు భారత్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొని ప‌రుగుల వ‌ర‌ద పారించారు.. రెండో రోజు ఒక వికెట్ న‌ష్టానికి 135 ప‌రుగుల‌తో బ్యాటింగ్ దిగిన గిల్, రోహిత్ లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు.. కెప్టెన్ రోహిత్ , గిల్ శ‌త‌కాలు చేశారు… రోహిత్ 103 పరుగులు, గిల్ 110 ప‌రుగులు చేసి అవుట‌య్యారు.. ఈ ఇద్ద‌రు క‌లిసి రెండో వికెట్ కి 171 ప‌రుగులు జోడించారు.. ఈ ఇద్ద‌రు అవుటైన త‌ర్వాత క్రీజ్ లోకి వ‌చ్చిన స‌ర్ప‌రాజ్ ఖాన్, అరంగేట్రం బ్యాట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ లు కూడా ప‌రుగుల జాత‌ర చేశారు.. ఈ ద‌శ‌లో 56 ప‌రుగులు చేసి స‌ర్ప‌రాజ్ అవుట్ కాగా, 65 ప‌రుగులు చేసిన దేవ‌ద‌త్ పెవిలియ‌న్ కు చేరాడు..

ఇక జ‌డేజా 15, జురెల్ 15, అశ్వీన్ 0 ప‌రుగుల‌కు ఔట‌య్యారు.. అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన కుల‌దీప్, బూమ్రాలు ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు.. చెడ్డ బంతుల‌తో ప‌రుగులు సాధించిన ఈ జంట మంచి బంతుల‌ను డిఫెన్ప్ తో అడ్డ‌కున్నారు.. ఈ ఇద్ద‌రు తొమ్మిదో వికెట్ కు 45 పరుగులు జోడించి రెండో రోజు ఆట‌ను ముగించారు.. కుల‌దీప్ 26, బుమ్రా 19 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో షోయ‌బ్ బ‌షీర్ కు నాలుగు వికెట్లు ల‌భించ‌గా, టామ్ హ‌ర్ట్లేకి రెండు, అండ్రుస‌న్ , బెన్ స్ర్టోక్ ల‌కు ఒక్కో వికెట్ ద‌క్కాయి..

హిట్ మ్యాన్ రికార్డులే రికార్డులు…

హిట్‌మ్యాన్ ధ‌ర్మ‌శాల టెస్టు లో త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపిస్తూ ‘రికార్డు బ్రేకింగ్ సెంచ‌రీ’ బాదాడు. ఇంగ్లండ్ బౌలింగ్ ద‌ళాన్ని చీల్చిచెండాడుతూ 12వ టెస్టు సెంచ‌రీ సాధించాడు. దాంతో, హిట్‌మ్యాన్ ప‌లు రికార్డులు బ్రేక్ చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 48 శ‌త‌కంతో అత‌డు హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డు స‌మం చేశాడు. అంతేకాదు ఓపెన‌ర్‌గా ఎక్కువ శ‌త‌కాలు బాదిన మూడో ఆట‌గాడిగా రోహిత్ మ‌రో రికార్డు త‌న పేరిట లిఖించుకున్నాడు.

- Advertisement -

వెస్టిండీస్ మాజీ డాషింగ్ ఓపెన‌ర్ క్రిస్ గేల్ ను రోహిత్ దాటేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్న‌ర్ 49 సెంచరీల‌తో టాప్‌లో ఉండ‌గా.. భార‌త లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ 45 శ‌త‌కాల‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌పై రోహిత్‌కు ఇది మూడో సెంచ‌రీ. దాంతో, ఆ జ‌ట్టుపై అత్య‌ధికసార్లు మూడంకెల స్కోర్ చేసిన రెండో భార‌త ఓపెన‌ర్‌గా హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టించాడు. మాజీ ఆటగాడు సునీల్ గ‌వాస్క‌ర్ 4 సెంచ‌రీల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. విజ‌య్ మర్చంట్ మూడో స్థానానికి ప‌డిపోయాడు. 2021 త‌ర్వాత ఎక్కువ సెంచ‌రీలు బాదిన టీమిండియా తొలి క్రికెట‌ర్‌గా రోహిత్ మ‌రో రికార్డు నెల‌కొల్పాడు.

గిల్ మ‌రో శ‌త‌కం…
భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో 110 ప‌రుగులు చేసి అవుట‌య్యాడు.. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఈ సిరీస్‌లో మాత్రం గిల్‌కు ఇది రెండో సెంచరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement