Monday, April 29, 2024

ICC World Cup 2023 – నేటి మ‌ధ్యాహ్నం భార‌త్ – ఇంగ్లండ్ వార్మ‌ప్ మ్యాచ్

గువ‌హాటి – భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. మెగా టోర్నీకి అక్టోబర్ 5న తెరలేవనుండగా వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. వరల్డ్ కప్-2023లో భాగంగా ఇవాళ రెండు వార్మప్ మ్యాచులు జరగనున్నాయి. గువహాటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడనున్నాయి. రెండు మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్ల అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు . ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో చిత్తు చేసిన టీమ్‌ఇండియా వరల్డ్‌ నంబర్‌ 1గా అవతరించింది. ఇక ఐర్లాండ్‌పై చెలరేగిపోయిన ఇంగ్లాం ఉపఖండ పిచ్‌లపై కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మ్యాచ్‌ ఫలితంపై పెద్ద ఆలోచన లేకపోయినా.. రెండు జట్లూ కూడా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించే అవకాశం ఉంది. మెగా టోర్నీలో తమ తమ జట్ల కూర్పులను, వనరులను పరీక్షించుకోవడానికి భారత్-ఇంగ్లాండ్‌కు ఇది మంచి అవకాశం.

వార్మప్ మ్యాచ్‌లో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. జట్టులోని ఎవరైన 11 మంది బ్యాటింగ్ చేయొచ్చు. ఎవరైన, ఎక్కడైన బౌలింగ్ చేయవచ్చు. దీంతో ఇరు జట్లు కూడా వీలైనంత ఎక్కువ మందికి మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా చేయొచ్చు. దూకుడుకు మారు పేరుగా మారిన ఇంగ్లాండ్.. మెగా టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. బెయిర్ స్టో, మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీలతో కూడిన బ్యాటింగ్ యూనిట్.. ఎటువంటి బౌలింగ్‌లో అయినా విధ్వంశం సృష్టించగలదు. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ జట్టు: డేవిడ్ మలన్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), మోయిన్ అలీ, సామ్ కర్రాన్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ, రీస్ టోప్లీ, గుస్ అట్కిన్సన్

- Advertisement -

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , శార్దూల్ ఠాకూర్

Advertisement

తాజా వార్తలు

Advertisement