Saturday, May 4, 2024

IPL | బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన హైదరాబాద్​.. 34 పరుగుల తేడాతో గుజరాత్​ గెలుపు

ఐపీఎల్​లో ఇవ్వాల (సోమవారం) రాత్రి గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. ఇందులో తొలుత గుజరాత్​ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కాగా, టార్గెట్​ 189 పరుగుల టార్గెట్​లో హైద‌రాబాద్ ఆదిలోనే ఇబ్బందులకు గురయ్యింది. త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.

ఈ క్రమంలో హెన్రిక్​ క్లాసిక్​ 44 బంతుల్లో (64) పరుగులు చేశాడు. ఆ తర్వాత భువనేశ్వర్​ (27) పరుగులు చేశాడు. ఇక మిగతా వారంతా కనీసం సింగిల్​ డిజిట్​ దాటి రన్స్​ తీయలేకపోయారు. దీంతో హైదరాబాద్​ జట్టు 9 వికెట్లు కోల్పోయి 154 ప‌రుగుల మాత్రమే చేయగలిగింది. ఇక.. గుజరాత్​ 34 పరుగుల  తేడాతో గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement