Thursday, May 16, 2024

కడవరకు ‘సాహా’సం, సీఎస్‌కేపై గుజరాత్‌ విక్టరీ.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా.. గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. గుజరాత్‌ ఓపెనర్‌ సాహా చెలరేగి ఆడటంతో గుజరాత్‌ విజయాన్ని అందుకుంది. సాహా 8 ఫోర్లు, 1 సిక్స్‌ బాది కడవరకు 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు క్రీజులో ఉండి గుజరాత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా.. 20 పాయింట్లకు చేరుకున్న గుజరాత్‌.. ప్లే ఆఫ్‌ రేసులో టాప్‌ 2 పోజిషన్‌లో ఒక జట్టుగా మారనుంది. దీంతో గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌ ఓడినా కూడా ఫైనల్‌ చేరేందుకు మరో మ్యాచ్‌ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేశాడు. జగదీషన్‌ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 39 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్స్‌లో సీఎస్‌కే జట్టు 5 వికెట్లు కోల్పోయి 133 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ ముందు ఉంచింది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్స్‌లో షమీ 4 ఓవర్స్‌లో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. రషీద్‌ ఖాన్‌, సాయి కిశోర్‌, జోసెఫ్‌కు తలో వికెట్‌ లభించింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌ ధాటికి చెన్నై డెత్‌ ఓవర్స్‌లో (15 నుంచి 20 ఓవర్స్‌) ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయింది. కాన్వే (5), మోయిన్‌ (21), శివం దూబే (0), ధోనీ (7) వద్ద ఔటయ్యారు. జగదీషన్‌ 39 వద్ద, శాంత్నార్‌ ఒక పరుగు వద్ద నాటౌట్‌గా నిలిచారు.

గుజరాత్‌ ఓపెనర్ల శుభారంభం
134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఓపెనర్లు వృద్ధి మాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. తొలి ఓవర్‌లోనే ముఖేష్‌ బౌలింగ్‌లో సాహా 3 ఫోర్లు కొట్టి ఫాంలోకి వచ్చేశాడు. అడపాదడపా బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శ్రీలంకన్‌ జూనియర్‌ లసిత్‌ మలింగ మతీష.. శుభ్‌మన్‌ గిల్‌ (18)ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఆ తరువాత మాథ్యు వడే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మోయిన్‌ అలీ బౌలింగ్లో (20) మోయిన్‌ అలీ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్గా వెనుదిరిగాడు.

ఆ తరువాత గుజరాత్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. మరోసారి మతీషా.. గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను (7) ఔట్‌ చేసి చెన్నై జట్టులో ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తరువాత వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ ఆచితూచి ఆడాడు. సాహాతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి బౌండరీ బాది.. విజయంతో ముగించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును వృద్ధిమాన్‌ సాహా అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌ను 7 వికెట్ల తేడాతో గెలిపించాడు. మథీషాకు 2 వికెట్లు దొరకగా.. మోయిన్‌ అలీకి ఒక వికెట్‌ దక్కింది.

స్కోర్‌బోర్డు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ : రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ (సి) వడే 53; కాన్వే (బి) షమీ (సి) వృద్ధిమాన్‌ సాహా 5; మోయిన్‌ (బి) సాయి కిశోర్‌ (సి) రషీద్‌ ఖాన్‌ 21; జగదీషన్‌ (నాటౌట్‌) 39; శివం దూబే (బి) జోసెఫ్‌ (సి) వృద్ధిమాన్‌ సాహా 0; ధోనీ (బి) షమీ (సి) యష్‌ దయాల్‌ 7; సాంత్నార్‌ (నాటౌట్‌) 1. ఎక్స్‌ట్రాలు : 7. మొత్తం : 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు. వికెట్ల పతనం : 1-8, 2-65, 3-113, 4-114, 5-130. బౌలింగ్‌ : షమీ 4-0-19-2, హర్దిక్‌ పాండ్యా 2-0-8-0, యష్‌ దయాల్‌ 3-0-27-0, రషీద్‌ ఖాన్‌ 4-0-31-1, జోసెఫ్‌ 3-0-15-1, సాయి కిశోర్‌ 4-0-31-1.
గుజరాత్‌ టైటాన్స్‌ : వృద్ధిమాన్‌ సాహా (నాటౌట్‌) 67; శుభ్‌మన్‌ గిల్‌ (ఎల్‌బీడబ్ల్యూ) (బి) మథీషా 18; మాథ్యూ వడే (బి) మోయిన్‌ (సి) శివం దుబే 20; హర్ధిక్‌ పాండ్యా (బి) మథీషా (సి) శివం దూబే 7; డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 15. ఎక్స్‌ట్రాలు 10. మొత్తం : 19.1 ఓవర్స్‌లో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు. వికెట్ల పతనం : 1-59, 2-90, 3-100. బౌలింగ్‌ : ముఖేష్‌ చక్రవర్తి 3-0-28-0, సిమర్జీత్‌ సింగ్‌ 3-0-26-0, మిచెల్‌ సాంత్నార్‌ 4-0-24-0, ప్రశాంత్‌ సోలంకి 4-0-18-0, మథీషా 3.1-0-24-2, మోయిన్‌ అలీ 2-0-11-1.

నల్లబ్యాండ్‌లతో సైమండ్స్ కు నివాళి..
ఆండ్రూ సైమండ్స్‌ మృతికి నివాళ్లు అర్పిస్తూ.. చెన్నై, గుజరాత్‌ జట్ల ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు. ఈ సందర్భంగా సైమండ్స్‌కు ప్రత్యేక నివాళులర్పించారు. సైమండ్స్‌ ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జన్‌ తరఫున ఆడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement