Sunday, May 5, 2024

సోఫియా కెనిన్‌పై గోమెజ్‌ విజయం..

టోరేపాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ తొలిరొండ్‌లో 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌కు ఓటమి ఎదురైంది. మెక్సికన్‌ క్వాలిఫయర్‌ ఫెర్నాండా కాంట్రెరాస్‌ గోమెజ్‌ 7-6, 6-4 తేడాతో విజయంసాధించింది. హోలాజిక్‌ డబ్ల్యుటిఎ టూర్‌ మెయిన్‌డ్రా మ్యాచ్‌లో గోమెజ్‌కు మొదటి విజయమిది. మొదటి సెట్‌ టై బ్రేక్‌లో ఆలస్యంగా సెట్‌ పాయింట్‌ను ఆదాచేసిన గోమెజ్‌, రెండవ సెట్‌లో ఆధిపత్యం చెలాయించి 5-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

1గంట 46 నిముషాల హోరోహోరీ పోరులో అంతిమంగా గోమెజ్‌ విజయం ఖరారైంది. 131 ర్యాంక్‌లో ఉన్న గోమెజ్‌ తదుపరి రౌండ్‌లో 4వ నెంబర్‌ సీడ్‌ వెరోనికా కుడెర్మెటోవాతో తలపడనుంది. మరోవైపు ఆవర సీడ్‌ కరోలినా ప్లిస్కోవా , 28వ ర్యాంకర్‌ జాంగ్‌ షువాయ్‌లు రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement