Friday, May 3, 2024

ఆసియా అండ్‌ ఒసియానియా అల్ట్రా రన్నింగ్‌ టోర్నీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌..

బెంగళూరు: కంఠీరవ స్టేడియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అల్ట్రా రన్నర్స్‌ (ఐఏయూ) 24వ ఆసియా అండ్‌ ఒసియానియా చాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అద్భుతంగా రాణించాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలోనూ, జట్టు పరంగా టైటిల్స్‌ చేజిక్కించుకుని బంగారు పతకాలు కైవసం చేసుకుంది. అమర్‌సింగ్‌ దేవంద నేతృత్వంలోని భారత అల్ట్రా రన్నర్స్‌ జట్టు శనివారం ఉదయం 8గం.ల నుంచి నిర్ణీత 24గంటల్లో మొత్తం 739.959 కి.మీ.లు ప్రయాణించి ఆదివారం ఉదయం రేసును ముగించింది. బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. అమర్‌సింగ్‌ వ్యక్తిగతంగా 258.418 కిమీలు ప్రయాణించి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో సౌరవ్‌ కుమార్‌ రంజన్‌ (242.564 కి.మీ), జీనో ఆంటోనీ (238.977 కి.మీ) నిలిచారు.

దీంతో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో బంగారు, వెండి, రజత పతకాలు భారత జట్టు వశమయ్యాయి. టీమ్‌ల పరంగా చూస్తే, భారత్‌ అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా (628.405), చీనీస్‌ తైపీ (563.591)తో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో భారత జట్టు అద్భుతంగా ప్రదర్శన కనబరిచి (570.70 కి.మీ) రెండో స్థానంలో నిలిచింది. వెండి పతకాన్ని చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా 607.63 కి.మీతో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, చైనీస్‌ తైపీ జట్టు 529.082 కి.మీ.లతో మూడో స్థానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత విభాగంలో భారత మహిళలెవరూ రాణించలేకపోయారు. ఓపెన్‌లో మాత్రం తృప్తి చవాన్‌ పతకాన్ని చేజిక్కించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement