Saturday, May 4, 2024

వరల్డ్‌ రైల్వే గేమ్స్‌లో డివిజినల్‌ అథ్లెట్‌ ప్రతిభ – రెండు గోల్డ్‌ మెడల్స్‌ కైవసం

అమరావతి, ఆంధ్రప్రభ: జర్మనీ దేశ రాజధాని బెర్లిన్‌లో జరుగుతున్న వరల్డ్‌ రైల్వే గేమ్స్‌లో విజయవాడ రైల్వే డివిజన్‌ ఇంజనీరింగ్‌ డిపార్టమెంట్‌లో జూనియర్‌ క్లర్క్‌గా పని చేస్తున్న ప్రీతి లాంబా సత్తా చాటింది. క్రాస్‌ కంట్రీ ఇండివిడ్యువల్‌, టీమ్‌ ఈవెంట్లలో పది కిలోమీటర్ల విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

నేషనల్‌ ఇండియన్‌ రైల్వే అథ్లెటిక్‌ బృందంలో ప్రాతినిధ్యం వహించిన ప్రీతి లాంబా 2019లో నేపాల్‌లో జరిగిన సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించింది. తాజాగా బెర్లిన్‌ వరల్డ్‌ రైల్వే గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడంపై విజయవాడ డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌, ఏడీఆర్‌ఎంలు డి. శ్రీనివాసరావు, ఎం. శ్రీకాంత్‌, డివిజినల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ వల్లిdశ్వర. బి. తోకల, సీనియర్‌ డీఈఎన్‌ ఇ. శాంతారాం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement