Thursday, April 25, 2024

వరద విపత్తులోనూ మౌనం దాల్చిన బోర్డులు.. సమాచారాన్ని రాష్ట్రాలకు ఇవ్వని కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని గోదావరి పరివాహక జిల్లాలతోపాటు కృష్ణా పరివాహక ప్రాంతాన్నీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో సంభవించిన వరదలకు పలు జిల్లాల్లో జనం నిరాశ్రయిలయ్యారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయినప్పటికీ గోదావరి నదీ యాజమాన్య బోర్డు వరదల తాలూకు సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖకు అందించలేదు. వరదల నివారణ జాగ్రత్తలపై తెలంగాణ, ఏపీలకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న సమాచారాన్ని అంచనా వేసి తెలుగు రాష్ట్రాలను ముందే హెచ్చరించకుండా మిన్నకుండి పోయింది.

పదే పదే డీపీఆర్‌లు ఇవ్వండి… ప్రాజెక్టులను పరిధిలోకి తీసుకుంటాం… అంటూ లేఖలను పంపించిన జీఆర్‌ఎంబీ వరదల సమయంలో మౌనం దాల్చింది. ఈ పరిస్థితుల్లో బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులన్నీ తీసుకొస్తే మరిన్ని కష్టాలు తప్పవని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విపత్తులు సంభవించినపుడు బోర్డులు ఏ మేరకు ప్రజలను ఆదుకుంటాయని..? నీటిపారుదల అధికారులు ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్‌ గేజింగ్‌ సిస్టం ద్వారా వరద సమాచారాన్ని ముందే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సీడబ్ల్యూసీ అంచనా వేస్తుంది. ఆ సమాచారాన్ని బోర్డులకు పంపితే…బోర్డులు ఆయా రాష్ట్రాలకు చేరవేయాల్సి ఉంటుం ది. అయితే జీఆర్‌ఎంబీ కాని, కేఆర్‌ఎంబీ కాని ఎటుంటి వరద హెచ్చరిక సమాచారాన్ని ఇవ్వకపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement