Friday, May 17, 2024

IPL | చెన్నై చేతిలో ఢిల్లీ ఢమాల్​.. చేజింగ్​లో చతికిలపడ్డ బ్యాటర్లు

చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగిన మ్యాచ్​లో చెన్నై విజయం సాధించింది. తొలుత టాస్​ గెలిచి బ్యాటింగ్​ తీసుకున్న ధోనీ.. ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. టాపార్డర్​ నుంచి మిడిలార్డర్​ వరకు అనుకున్న స్థాయిలో ఆటతీరు లేకపోయినా.. పర్వాలేదు అనిపించారు. తలా 20 పరుగులకు పైగానే చేశారు. దీంతో ఎనిమిది వికెట్లు కోల్పోయిన చెన్నై 167 పరుగులు చేసి, ఢిల్లీ జట్టు మందు 168 పరుగుల టార్గెట్​ పెట్టింది..

ఇక.. చేజింగ్​ చేసే క్రమంలో ఢిల్లీ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ (0) గోల్డెన్​ డక్​గా పెవిలియన్​ చేరాడు. దీంతో ఖాతా తెరవకుండా ఢిల్లీ వికెట్​ కోల్పోవడంతో కాస్త నిరశగా ఉంది. అయితే.. ఫిలిప్​ సాల్ట్ (17), మనీశ్​ పాండే (27), రీలీ రోస్సో (35), అక్షర్​ పటేల్​ (21) పరుగులతో రాణించినా.. అనుకున్న టార్గెట్​ ఛేదించడంలో వెనకబడిపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement