Wednesday, May 1, 2024

CWC 2023 – నెద‌ర్లాండ్ బౌలింగ్ కు పాక్ విల‌విల … 10 ఓవ‌ర్ల‌లోనే మూడు ప్ర‌ధాన వికెట్లు డౌన్…

హైద‌రాబాద్- వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా రెండో మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానం పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జ‌రుగుతున్న మ్యాచ్ లో పాక్ పీక‌లోతు క‌ష్టాల‌లో ప‌డింది. ఈ మ్యాచ్ లో నెద‌ర్లాండ్స్ జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. నెద‌ర్లాండ్స్ బౌలింగ్ కు పాక్ బ్యాట‌ర్లు విల‌విల‌లాడుతున్నారు..

ముందుగా ఫ‌క‌ర్ జమ‌న్ 15 ప‌రుగులు చేసిన అనంత‌ర్ డీన్ వీక్ పెవిలియ‌న్ కు పంపించాడు.. కేవ‌లం అయిదు ప‌రుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజ‌మ్ ను అక్ర‌మాన్ బౌలింగ్ కి చిక్కాడు.. ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్ వికెట్ ను వీన్ మక్ర‌న్ తీసుకున్నాడు.. హ‌క్ కేవ‌లం 15 ప‌రుగులు చేశాడు.. 11 ఓవ‌ర్లు ముగిసేనాటికి పాక్ మూడు వికెట్ల న‌ష్టానికి 53 ప‌రుగులు చేసింది..మ‌హ్మాద్ రిజ్వాన్, ష‌కీల్ క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement