Monday, April 29, 2024

క్రిస్‌గేల్‌ సిక్సర్ల రికార్డు

ఐపీఎల్లో యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ చరిత్ర సృష్టించాడు.
మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గేల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌
జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌..ఐపీఎల్‌లో 350 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది ఈ ఫీట్ అందుకున్నాడు. మరే ఇతర బ్యాట్స్‌మన్‌ కనీసం 250 మార్క్‌ కూడా చేరుకోలేదు. సౌతాఫ్రికా సూపర్‌ స్టార్ ఏబీ డివిలియర్స్‌ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 351 సిక్స్‌ బాదాడు. ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచిన క్రిస్‌ గేల్‌ రికార్డును భవిష్యత్‌లో ఏ బ్యాట్స్‌మన్‌ బ్రేక్‌ చేస్తాడో.

Advertisement

తాజా వార్తలు

Advertisement