Thursday, March 28, 2024

‘టక్ జగదీష్’ న్యూ పోస్టర్ రిలీజ్

ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ హీరోలు సినీ అభిమానులకు సర్ ప్రైజ్ లను అందిస్తూ వారి సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు పోస్టర్స్, టీజర్లు రాగా ఇప్పుడు నాచురల్ స్టార్ నాని కూడా తన కొత్త సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా టక్ జగదీష్ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ప్రధాన తారాగణం అంతా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. కాగా ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని నాని తెలిపాడు. ఈ సినిమాలో నాని సరసన రీతూవర్మ రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement