Friday, May 17, 2024

ధోని బ్యాక్ టూ ఫామ్..


మహేంద్రసింగ్ ధోని క్రికేట్ లో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు….ఇంటర్నేషనల్ క్రికేట్ కు గుడ్ బై చెప్పి అభిమానులను నిరాశపరిచిన…ఐపీఎల్ లో ధోని ఆటను చూసే అవకాశం దక్కనుంది. 2021 సీజన్ ఐపీఎల్ కోసం చెన్నై టీం ఫ్రాంచైజీ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సారథి ధోనీ నెట్స్‌లో సాధన మొదలు పెట్టేశాడు. తొలుత డిఫెన్స్ సాధన చేశాడు. అనంతరం తనదైన శైలిలో సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9 న ప్రారంభమై మే 30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement