Sunday, April 28, 2024

Mitchell Marsh : మిచెల్ మార్ష్‌ పై కేసు నమోదు

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. టోర్నీ ఆసాంతం ఓటమనేది ఎరగకుండా.. అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడటం ఫ్యాన్స్‌కు బాధించింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రవర్తన అంతకు మించి బాధపడేలా చేశాడు.


అందుకు ఆసీస్‌ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్‌ పండిట్ కేశవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ గేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వరల్డ్‌కప్ మీద కాళ్లు పెట్టి ప్రతిష్ఠాత్మకమైన ఆ ట్రోఫీని అవమానించటంతో పాటుగా 140 కోట్ల మంది భారతీయుల సెంటిమెంట్‌ను గాయపరిచాడని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఫైనల్‌లో భారత్‌పై గెలిచి వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఈ సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement