Saturday, May 4, 2024

Ashwin : బెన్ స్ర్టోక్ డిఫెన్స్ ఆటే అత‌డికి శాపం ..

తన బౌలింగ్‌లో వరుసగా ఎల్‌బీడబ్ల్యూ‌గా వెనుదిరగడం పట్ల ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. స్టోక్స్ రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫుల్లర్, వైడర్ బంతులు సంధించేందుకు అనుమతిస్తున్నట్టు తనకు అనిపిస్తుందని అశ్విన్ వెల్లడించాడు.

- Advertisement -

స్టోక్స్ డిఫెన్స్ ఆడినప్పటికీ తాను అనుకున్న విధంగానే స్టోక్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశానని స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ అశ్విన్ ఈ విధంగా స్పందించాడు. స్టోక్స్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రతి బంతిని ఫార్వర్డ్ ఆడడానికి ప్రయత్నిస్తుంటాడని పేర్కొన్నాడు. కాగా బెన్‌స్టోక్స్‌ని అశ్విన్ రికార్డు స్థాయిలో టెస్టులో ఔట్ చేశాడు. దీంతో అతడి బౌలింగ్‌‌లో ఆడేటప్పుడు స్టోక్స్ ఆచితూచి ఆడాడ‌ని, అదే అత‌డి పాలిటి శాప‌మైంద‌ని అన్నాడు.. స‌హ‌జ ఆట‌ను ఆడ‌లేక‌పోవ‌డం అత‌డిని దెబ్బ‌తీసింద‌న్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement