Friday, April 26, 2024

పెళ్లి చేసుకుంటున్న ఆడ‌మ్ జంపా..తొలి మ్యాచ్ కు దూరం..

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా పెళ్లి చేసుకోబుతన్నాుడ. దీంతో ఐపీఎల్ తొలి మ్యాచ్ కి అందుబాటులోకి ఉండటం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ తెలిపింది. ఏప్రిల్ 9న త‌న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో విదేశీ ప్లేయ‌ర్స్ అందుబాటులో ఉండ‌టం లేదని, ఆడ‌మ్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని హెస‌న్ చెప్పారు. క్రితం సీజన్ లో ఆడమ్ జంపా కేవలం 3మ్యాచుల్లో ఆడాడు. అయితే ఈ సారి జంపాను వీలైనన్ని ఎక్కువ మ్యాచులు అడించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇక ఆర్సీబీ ఈ సారి ఎలాగైన కప్పు కొట్టాలన్న కసితో ఉంది…క్రితం సీజన్ లో సెమీఫైనల్ వరకు వచ్చిన ఫైనల్ చేరలేకపోయింది. ప్రతిసారి లాగే సారి కూడా కప్ మాదే అంటోంది ఆర్సీబీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement