Tuesday, April 30, 2024

యాషెస్​ సిరీస్​లో ఇంగ్లండ్​పై ఆసీస్‌ ఆధిపత్యం

అడిలైడ్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా గురువారం పైచేయి సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలిరోజు ఆటముగిసేసరికి 89ఓవర్లలో 2వికెట్లకు 221పరుగులు చేసింది. ఓపెనర్‌ వార్నర్‌ 167బంతుల్లో 11ఫోర్లుతో 95పరుగులుచేసి త్రుటిలో మరోసారి సెంచరీని కోల్పోయి స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లబుషేన్‌ 95పరుగులతో, కెప్టెన్‌ స్మిత్‌ 18పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌, స్టోక్స్‌ చెరో వికెట్‌ తీశారు.

స్టువర్ట్‌ బ్రాడ్‌ 150 టెస్టులు..
అడిలైడ్‌: సిరీస్‌లో భాగంగా గురువారం అడిలైడ్‌లో మొదలైన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రాడ్‌ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. 150టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో భారత బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్‌ తర్వాత ఆసీస్‌ మాజీ కెప్టెన్‌లు రికీ పాంటింగ్‌, స్టీవ్‌వా 168 టెస్టులతో దితీయ స్థానంలో కొనసాగుతున్నారు. 167 టెస్టులతో నాలుగో స్థానంలో ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ అండర్సన్‌ నిలవగా 166టెస్టులతో సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాకెస్‌ కలిస్‌ ఐదోస్థానంతో టాప్‌-5లో కొనసాగుతున్నాడు. కాగా 2007లో సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెట్టింన బ్రాడ్‌ 525వికెట్లు తీశాడు. టెస్టు ఫార్మాట్‌లో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ 800వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement