చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో) భారత్ పతకాల వేట ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియాకు తొలి పతకం లభించింది. రమిత, మొహులీ ఘోష్, ఆషి చౌక్సీతో కూడిన మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించింది. చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించగా, 1886 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్యా పతకం గెలుచుకున్నది.
- Advertisement -