Monday, October 14, 2024

Asian games – భారత్ కు తొలి పసిడి పతకం – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది . రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.క్వాలిఫికేషన్ ఫైనల్‌ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్‌ అగ్రస్ధానంలో నిలిచింది.

. ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా(1890.1 స్కోర్‌) సిల్వర్‌ మెడల్‌ సొం‍తం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement