Tuesday, May 28, 2024

Vishakapatnam – జ‌న్మ‌భూమి రైలుకు త‌ప్పిన ముప్పు…విశాఖ స్టేష‌న్ లో విడిపోయిన ఎసి బోగీలు

గుర్తించ‌కుండా వెళ్లిపోయిన ట్రైన్
స‌కాలం స్పందించిన రైల్వే సిబ్బంది
తిరిగి వెనక్కి ర‌ప్పించిన రైలు
మూడు గంట‌ల పాటు శ్ర‌మించి మ‌ర‌మ‌త్తులు

ఏపీలో ఓ సూపర్ ఫాస్ట్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విశాఖ – విజయవాడ జన్మభూమి సూపర్‌ఫాస్ట్ విశాఖలోనే నిలిచిపోయింది. విశాఖ‌ప‌ట్నం నేటి ఉదయం 6 గంటల 20 నిమిషాలకు రైలు బయల్దేరింది. కాగా బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్‌ తెగిపోయింది. 2 బోగీలను స్టేషన్‌లోనే వదిలి జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ముందుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును విశాఖ స్టేషన్‌కు తిరిగి తీసుకొచ్చారు.

- Advertisement -

సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించిన త‌ర్వాత మూడు గంట‌ల ఆల‌స్యంతో రైలు బ‌య‌లుదేరింది. కాగా, రైలు ఆలస్యంతో ప్రయాణికులు 2-3 గంటలు స్టేషన్‌లోనే ఇబ్బందులు పడ్డారు. . తమ గమ్యస్థానానికి అనుకున్న సమయానికి చేరలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement