Sunday, May 5, 2024

నేటి నుంచి యాషెస్‌ సిరీస్‌.. గబ్బాలో ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా తొలి టెస్టు

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌లోని తొలి టెస్టు బుధవారం ఆరంభం కానుంది. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ కమిన్స్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. స్మిత్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్టులో నేడు ఇరుజట్లు గబ్బాలో తలపడనున్నాయి. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫామ్‌లో ఉండటంతో ఆసీస్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

మరోవైపు ఇంగ్లండ్‌ జట్టులో స్టార్‌పేసర్‌ జిమ్మీ అండర్సన్‌తోపాటు బెయిర్‌స్టో దూరమవడంతో కెప్టెన్‌ జోరూట్‌పై ఎక్కువ భారం పడనుంది. ఇంగ్లండ్‌ గబ్బాలో కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లే గెలవడం ఇంగ్లీష్‌ జట్టును కలవరపరుస్తుంది. కాగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 71 యాషెస్‌ సిరీస్‌లు జరిగాయి. వీటిలో ఆస్ట్రేలియా 33సిరీస్‌ల్లో, ఇంగ్లండ్‌ 32యాషెస్‌ సిరీస్‌ల్లో విజేతగా నిలిచాయి. 6సిరీస్‌లు డ్రాగా నిలిచాయి. మొత్తం ఇరుజట్లు మధ్య 355టెస్టులు జరగగా ఆసీస్‌ 136టెస్టుల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ 108మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 91టెస్టులు డ్రా అయ్యాయి.

ఇంగ్లండ్‌ అంచనా జట్టు: రోరీ బర్న్స్‌, హసీబ్‌ హమీద్‌, డేవిడ్‌ మలన్‌, జోరూట్‌ (కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, ఓలీపోప్‌, జోస్‌బట్లర్‌ (వికెట్‌కీపర్‌), క్రిస్‌వోక్స్‌, రాబిన్‌సన్‌, మార్క్‌వుడ్‌, స్టువర్ట్‌బ్రాడ్‌/జాక్‌లీచ్‌.

ఆస్ట్రేలియా అంచనా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ హరీస్‌, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కెమెరాన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement