Friday, May 17, 2024

Sports: క్రీడాకారులందరూ సమానమే, ర్యాంకును బట్టి పోటీ ఉండదు: పీవీ సింధు

అంతర్జాతీయ మ్యాచుల్లో తనకు కష్టంగా భావించే ప్రత్యర్థి ఎవరూ లేరని, అందరూ ఒకేలా భావిస్తానని, ప్రపంచ ర్యాంకింగ్‌తో సంబంధం లేకుండా ఆటను ఎంజాయ్‌ చేయాలని ఒలింపిక్‌ డబుల్‌ పతకదారి పీవీ సింధు చెప్పుకొచ్చింది. అయితే ప్రతీ ఒక్కరు తమ ప్రత్యర్థి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ప్రత్యర్థిని తనకు టఫ్‌ కాదని, అదే సమయంలో.. ఎవరు ఎవరిని అయినా ఓడించగలరని అభిప్రాయపడింది. 2022 గోవా ఫెస్ట్‌కు హాజరైన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. క్రీడాకారులందరూ సమానమే అని, టాప్‌ ర్యాంకులో ఉన్న ఆటగాడు ఎంతో నైపుణ్యం గలవాడు అని భావించొద్దని సూచించారు. అదేవిధంగా తక్కువ ర్యాంకు ఆటగాడితో ఆడతున్న సమయంలోనూ ఇదే ఆలోచనతో ఉండాలన్నారు. తక్కువ ర్యాంకు ఆటగాడు అని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. సునాయాసంగా గెలుస్తాననే అతి విశ్వాసం మంచిదికాదన్నారు.

అతి విశ్వాసం వద్దు
ఈ క్రీడాకారుడు చాలా టఫ్‌, ఓడించలేమని చెప్పనని, ప్రతీ ఒక్కరు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని పీవీ సింధు అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రతీ ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కరోనా కారణంగా చాలా క్రీడలు కొన్ని నెలల వాయిదా పడ్డాయని, ఇది చాలా బాధాకరమే అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ టోర్నీల కోసం ప్రతీ క్రీడాకారుడు నాలుగేళ్లుగా ఎదురుచూస్తు ఉంటాడని తెలిపారు. ఒలింపిక్‌ తరువాత కూడా.. జరిగిన ప్రతీ టోర్నీలో.. క్రీడాకారులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారన్నారు. సెమీ ఫైనల్‌కు చేరిన క్రీడాకారుడికి పాజిటివ్‌ వచ్చి.. టోర్నీకి దూరం అయితే.. అంతకంటే బాధ ఏదీ ఉండదన్నారు. ఏది ఏమైనా.. ఒలింపిక్‌ క్రీడల సమయంలో తాను ఎంతో జాగ్రత్తగా ఉన్నా అని, కాంస్య పతకం గెలిచానని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement