Thursday, May 16, 2024

Jaisha hat trick | మూడోసారి ఏసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జైషా !

బీసీసీఐ కార్యదర్శి జై షా వరుసగా మూడోసారి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలీలో జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో శ్రీలంక క్రికెట్‌ అధ్యక్షుడు షమ్మి సిల్వా జై షా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా ఏసీసీ సభులంతా ఏకగ్రీవంగా ఆమెందించారు. 2021 నుంచి జై షా వరుసగా ఏసీసీ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆ తర్వాత నుంచి జై షా హ్యాట్రిక్‌గా ఎన్నికవడంతో ప్రస్తుతం ఆయకు పోటీదారులు ఎవరూ లేరని తెలుస్తోంది. ఇక జైషా హయంలో ఏసీసీ.. ఆసియాకప్‌ టోర్నీలను టీ20, వన్డే ఫార్మాట్‌లలో విజయవంతంగా నిర్వహించింది. ఏసీసీ సభ్యులకు జై షా ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి కీలక పదవిని అందించినందుకు బోర్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరూ కలిసి ఆసియా ఖండమంతటా క్రికెట్‌ను అభివృద్ధి చేద్దామని ఆయన పేర్కొన్నారు. ఆసియా టొర్నీల ద్వారా ప్రతీభవంతులైన క్రికెటర్లను వెలికి తీస్తున్నామని షా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement