Sunday, April 28, 2024

Today’s Match | గుజరాత్‌కు లిట్‌మస్ టెస్ట్‌.. ఓడితే ఇంటికే !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) రెండవ సీజన్‌లో 16వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 ఓటములతో ఆకట్టుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ కు కీలకంగా మారింది. గుజరాత్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉండాలంటే, గుజరాత్ జెయింట్స్‌కి ఇది తప్పక గెలవాల్సిన గేమ్. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే టాప్-3లో బెర్త్‌ ఖాయం చేసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement