Monday, April 29, 2024

67th Match : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 67వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ లో లేని ఢిల్లీ ఫ్రీ గా ఆడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చెన్నై 7 మ్యాచ్ లలో గెలిచి 15 పాయింట్ లతో ప్లే ఆఫ్ కు అడుగు దూరంలో నిలిచి ఉంది.

కానీ ఈ రోజు కనుక ఢిల్లీ పై చెన్నై ఓడితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశం తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే లక్నో కూడా చెన్నై తో పాటు సమానంగా పాయింట్ ను సాధించి ఉంది. ఒకవేళ ఈ రోజు చెన్నై ఓడినా ప్లే ఆఫ్ కు వెళ్ళాలంటే మాత్రం… రాత్రి జరగనున్న మరో మ్యాచ్ లో లక్నో పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి తీరాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement