Wednesday, May 1, 2024

MLA Rapaka – మ‌రీ ఇంత వీరభక్తా సామీ…వెడ్డింగ్ కార్డుపై జ‌గ‌న్, భార‌తీ ఫోటోలు

రాజోలు – జ‌నసేన పార్టీ త‌రుపున గెలిచి వైసీపీ గూటికి చేరిన కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు జ‌గ‌న్ ఆయ‌న‌కు సీటు ఖరారు చేశారు. దీంతో రాపాక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్ల ఉన్న‌కృత‌జ్ఞ‌త‌ల‌ను వినూత్నంగా తెలిపారు.. రాపాక త‌న‌ కుమారుడి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్ భారతి చిత్రాలు ఆకట్టుకునేలా ముద్రించారు. ఇప్పటికే పలుమార్లు బయట అసెంబీలో జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక మాట్లాడి తన వీర విధేయతను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్ కు వీరభక్తుడినని మ‌రోసారి చాటిచెప్పారు. ఈ పెళ్లి పత్రికపై వైసీపీ శ్రేణులు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement