Sunday, May 19, 2024

ర్యాపేజ్‌ ఫార్మట్‌లో 2024 ఒలంపిక్‌ క్రీడలు..

ప్రపంచ ఒలంపిక్‌ క్రీడల్లో సరికొత్తగా ర్యాపేజ్‌ పద్దతిలో క్రీడాకారులకు అవకాశం ఇస్తున్నట్లు ప్రపంచ అథ్లెటిక్‌ ప్రసిడెంట్‌ సెబాస్టియన్‌ కో తెలిపారు. క్రీడాకారులు వ్యక్తిగత ట్రాక్‌తో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల దూరంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పారిస్‌ ఒలంపిక్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది. క్రీడల్లో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికేలా ర్యాపేజ్‌ ఫార్మాట్‌లో క్రీడాకారుడు మొదటి రౌండ్‌లో అర్హత సాధించలేక పోతే రెండో రౌండ్‌ అర్హత సాధించడానికి వీలు కల్పిస్తుంది. ర్యాపేజ్‌ రౌండ్‌లో పాల్గొని సెమీ ఫైనల్స్‌ కు అర్హత సాధించవచ్చు. ఈ ఫార్మాట్‌ను కుస్తీ మరియు ఫెన్సింగ్‌ క్రీడాకారులు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అథ్లెట్స్‌ కు సరికొత్త పద్ధతిలో ఆడిషన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ర్యాపేజ్‌ పద్ధతిలో క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుడు కనీసం రెండు సార్లు అర్హత సాధిస్తే ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అథ్లెట్లు మరియు ఇతర ప్రసార కర్తలతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రతి ఈవెంట్‌లో అడ్వాన్స్‌ సిస్టమ్‌తోపాటు ర్యాపేజ్‌ యొక్క ఫార్మాట్‌ను ముందుగానే ప్రకటించి ప్రకటిస్తామని చెప్పారు. అంతేగాక వచ్చే ఏడాది బుడాస్పెట్‌లో ఆగస్టు 19 27 వరకు జరుగనున్న క్రీడల ప్రారంభోత్సవంలో వెయ్యి మీటర్ల మారథాన్‌, సంయుక్తంగా, వాకింగ్‌ అథ్లెట్స్‌ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ఒలంపిక్‌ ప్రకటించింది. క్రీడాకారుని ప్రవేశ ప్రమాణాల్లో 50శాతం కోటాతోపాటు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా ఉంటుందని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement