Monday, April 29, 2024

ప్రేమిస్తూ న‌టించాను – శ్రియా శ‌ర‌ణ్

నటిగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న తార శ్రియ. ఇష్టంతో మొదలైన ఆమె కెరీర్‌ ఇంకా అదే స్థాయిలో కొనసా గడం విశేషం. తాజాగా బాలీవుడ్‌ నటు-డు శర్మాన్‌ జోషి, శ్రియా కాంబి నేషన్‌లో రూపొందిన సినిమా ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారా వు బియ్యాల (మాజీ ఐఏఎస్‌ అధికారి) దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్‌ స్కూల్‌ నేటి సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అకాడమిక్‌ ఒత్తిళ్ల ను ఎదుర్కొనే విద్యార్థుల సున్ని త, ప్రబలమైన సంగీత నేపథ్య కథనం తో తెరకెక్కుతోంది. ఇందులో పద కొండు పాటలున్నాయి. మే 12న విడుదల కానుండగా.. తెలుగులో దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి శ్రియా పాత్రికేయులతో ముచ్చటించారు.


ఈ సినిమాలో సంగీతం నేర్పే టీ-చర్‌గా నటించాను. క్యారెక్టర్‌ బాగుండటంతో నటించేందుకు ఒప్పుకున్నాను. ఇటీవల కాలంలో ఇలాం టి చిత్రం రాలేదు. ఇది కేవలం అవార్డులు, రివార్డుల కోసం తీసిన చిత్రం కా దు. కమర్షియల్‌గా ఆకట్టు-కునే అంశాలు ఉంటాయి. పిల్లల మెంటాలిటీ- ఎలా ఉంటు-ంది. వాళ్లను ప్రోత్సహిస్తే జీవితంలో ఎలా పైకి వస్తారు అనే అంశాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులను ఆలోచింపజేస్తాయి ఈ సినిమాలోని పాత్రను నేను ప్రేమిస్తూ చేశాను. వర్క్‌షాప్‌ కూడా మధ్యమధ్యలో నిర్వహించారు. ఈ సినిమా ద్వారా తెలియని విషయాలు తెలుసుకున్నాను. నిజ జీవితం లో నాకు కూడా సంగీతం అంటే బాగా ఇష్టం. గతంలో నేనున్నాను చిత్రం లో సంగీతం మాస్టర్‌ అమ్మాయిగా…అప్పట్లో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. నిజానికి సంగీతం అనేది ఒక దైవత్వం. అందులో మునిగితేనే దాని విలువ తెలిసివస్తుంది. నేను కూడా చిన్నప్పుడు అమ్మ ప్రోత్సాహంతో మ్యూజిక్‌, డ్యాన్స్‌ చేసేదానిని. ఇళయరాజా లాంటి లెజెండ్‌తో పనిచేయడం నా అదృష్టం. నేను ఇలాంటి సినిమాలో చేశానని గర్వపడే స్థాయిలో ఉంటు-ంది.
శర్మాన్‌జోషి లాంటి నటు-డితో చేయడం ఎంతో హ్యాపీ. ఈ చిత్రానికి మాజీ ఐఏఎస్‌ అధికారి పాపారావు దర్శకత్వం వ హించారు. అయనకు ప్రతి సన్నివేశంపై ఎంతో గ్రిప్‌ ఉంది. చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి చిత్రాలు. ప్రకా ష్‌రాజ్‌, ఒజు బరువా, గ్రేసీ గోస్వామి వంటి నటు-ల తో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని శ్రి య తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement