Sunday, April 28, 2024

Shriya Saran : అమృతం తాగిందా….

రెండు దశాబ్దాల క్రితం ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియా సరన్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. స్టార్స్‌, సూపర్‌ స్టార్స్ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. ఏకంగా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించి ప్రపంచవ్యాప్తంగా తన నటనతో మరియు అందంతో గుర్తింపు దక్కించుకుంది.

- Advertisement -

సౌత్‌ లో కెరీర్‌ ను ఆరంభించిన ఈ అమ్మడు అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల కనిపించింది. నాలుగు పదుల వయసుకు వచ్చిన ఈ అమ్మడు ఇంకా కూడా ఏదో ఒక సినిమాలో నటిస్తూ బిజీగానే ఉంది. సీనియర్ హీరోలకు వాంటెడ్‌ హీరోయిన్ గా ఉండటానికి ఈ అమ్మడి ఈ స్థాయి అందం కారణం అనడంలో సందేహం లేదు. పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా శ్రియ అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా ట్రెండ్‌ కు తగ్గట్లుగా అందాల ఆరబోత చేస్తూ కన్నుల విందు చేస్తుంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ శ్రియా సరన్‌ మరోసారి సోషల్‌ మీడియా ద్వారా ఇంతటి అందాల ఆరబోత ఫోటోను షేర్‌ చేసి నెటిజన్స్ కి పెచ్చెక్కిస్తుంది.

ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న ఈ అమ్మడికి మరో పదేళ్ల పాటు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కంటిన్యూ అవ్వడం ఖాయం అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ మూడు పదుల వయసుకు రాగానే అందం తగ్గి సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉంటారు. శ్రియా మాత్రం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేస్తూ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోయింగ్‌ ను దక్కించుకుంది. ఈతరం హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు అని పలు సార్లు నిరూపించుకున్న ఈ అమ్మడు మరోసారి కన్నుల విందు చేసింది. ముందు ముందు మరెన్ని అందాల ఆరబోత ఫోటోలు చూస్తామో.

Advertisement

తాజా వార్తలు

Advertisement