Tuesday, May 7, 2024

Ashika: నా సామిరంగ …ఏందీ పూల జ‌డ …

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భోగి పండుగ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది. లంగా ఓణిలో, చీరకట్టులో అదరహో అనిపించింది.

- Advertisement -

ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ యంగ్ బ్యూటీ సొగసుకి యువత ఫిదా అవుతున్నారు. తాజాగా ఆషిక డిజైనర్ లంగా ఓణిలో ఎంతో అందంగా అల్లరిపిల్లలా ఇస్తున్న ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి.

ఆషిక కుందనపు బొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement