Thursday, April 25, 2024

Mrinal Thakur : మృణాల్ ఠాకూర్ దూకుడు…

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. సీతగా నటించి అందరి మన్ననలు అందుకుంది. సీతారామం సక్సెస్‌తో మృణాల్‌కు వరుసగా అవకాశాలు కూడా అందుతున్నాయి.

- Advertisement -

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ అది చేజారిపోయిందని ఈ ముద్దుగుమ్మ వాపోతూ చెప్పుకొచ్చింది. చివరికి ప్రయత్నించగా ‘లవ్ సోనియా’ సినిమాతో తనకు గుర్తింపు వచ్చిందంది. ఆ తర్వాత సినీ అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆమె చెప్పింది. సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని అయినా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement