Thursday, April 25, 2024

MDK: ఒక్క అవకాశం ఇవ్వండి… బీఆర్ఎస్ మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

ప్రజా సేవలో తరిస్తా ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి
గెలిస్తే.. రూ.100 కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు
పేద విద్యార్థుల చదువు కోసం ప్రతి సంవత్సరానికి 20 కోట్ల ఖర్చు
బిఆర్ఎస్ మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

ఉమ్మడి మెదక్ బ్యూరో : ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా.. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి.. గెలిస్తే 100 కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజాసేవ చేసి తరిస్తానని మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు.. సంగారెడ్డి పట్టణంలోని పిఆర్ఎస్ గార్డెన్ లో మంగళవారం మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు హాజరయ్యారు. ఈసంధర్బంగా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… ఇది మొదటి సన్నాహక మీటింగ్ సమావేశమని, నేను మీ అందరికీ సుపరిపరిచితుడినని, నేను ఉమ్మడి మెదక్ లో 11 సంవత్సరాలు పని చేశానన్నారు. సంగారెడ్డిలోనే నివాసం ఉన్నానని, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారని.. నేను ఇక్కడి వాడినేనని, జిల్లా పరిధిలోని తెల్లాపూర్ లో నివాసముంటున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఆదరాభిమానాలతో ఏడున్నర సంవత్సరాలు, జాయింట్ కలెక్టరుగా, 5 సంవత్సరాలుగా సిద్దిపేట కలెక్టర్ గా పని చేశానని స్పష్టం చేశారు. భారతదేశంలో ఒక్క కలెక్టర్ చేయలేని పనిని, ఓకే ప్రాంతానికి సేవలందించడం అనేది గర్వకారణంగా భావిస్తున్నానన్నారు. ప్రజల సమస్యలను నా ఇంటి సమస్యలుగా భావించి ప్రజా సేవ చేశాను. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారనే, నమ్మకం ఉంది కనుకనే కేసీఆర్, హరీష్ రావులు నా మీద నమ్మకంతో ఎంపీ టిక్కెట్ కేటాయించారన్నారు.. పెద్దల సూచనలతో, ప్రజలందరి ప్రేమాభిమానంతో ఈ ఎన్నిక‌ల్లో తప్పక గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు..

రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు..
నేను ఎంపీగా గెలిచిన వెంటనే 5 సంవత్సరాల కాలంలో రూ.100 కోట్లతో పేద ప్రజల చదువు కోసం పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవలందిస్తానన్నారు.. నేను రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదని, సేవ చేయడానికి మాత్రమే వచ్చానన్నారు. ప్రతి సంవ‌త్స‌రం 20కోట్లు పేద ప్రజల విద్యార్థుల చదువుకు ఖ‌ర్చుపెడతానన్నారు. అదేవిధంగా 7 నియోజక వర్గాలలో సుమారు 2 కోట్లు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

వెంకట్రామిరెడ్డి విజయం ఖాయం..

  • మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ పార్లమెంట్ కు జరిగే ఎన్నికల్లో మెదక్ ఎంపిగా వెంకట్ రామిరెడ్డి గెలుస్తారని అన్నారు. ప్రజల సేవ చేస్తానడం చాలా గొప్ప నిర్ణయం, ఉమ్మడి మెదక్ ప్రాంతంలో ఉద్యోగరీత్యా ప్రజలకు అనేక రకాలుగా సేవ చేశారు. నిస్వార్థంగా సేవ చేయాలని చెప్పడం చాలా గొప్ప విషయం అన్నారు. రైతు రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారని అడిగారు. మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేస్తే పనికిరాకుండా పోతుందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది బీజేపీ లాభం చేకూరుతుందన్నారు. ఇప్పటికీ ఆలోచించి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వెంకట్ రామిరెడ్డిని గెలిపించాలన్నారు. రైతులను, మహిళలను, ఫెంచన్ దారులను మోసం చేసింది కాంగ్రెస్, కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి మీరిచ్చిన హామీలను నెరవేర్చాలని, గేట్లు తెరిచి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడం కాదు. మొదట మీరు ప్రజలకిచ్చిన పథకాలను, హామీలను నెరవేర్చుటకు పాలనపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంద‌న్నారు. మరోసారి మెదక్ బీఆర్ఎస్ అడ్డా అని తెలిపి బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డినీ గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, శివకుమార్, పట్నం మాణిక్యం, ఎర్రోళ్ల శ్రీనివాస్, నరహరి రెడ్డి, మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, విజేందర్ రెడ్డి, శివరాజ్ పాటిల్, దేశ్ పాండే, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement