Thursday, April 25, 2024

యువరాజ్ విధ్వంసానికి 14 ఏళ్లు పూర్తి

భారత క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ఒక ఐకాన్. యువరాజ్ ఆట తీరును ముఖ్యంగా తను కొట్టే సిక్సర్‌లను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. తన దూకుడైన ఆటతీరుతో ఎన్నో మ్యాచ్ లను యువరాజ్ సింగ్ గెలిపించాడు. తొలి ప్రపంచ టీ 20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులను కొట్టిన యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్ ను ఎవరు మరిచిపోలేరు. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు నేటితో 14 ఏళ్ళు నిండాయి. సరిగ్గా 2007 సంవత్సరం సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆరు బంతులను సిక్స్ లుగా మలిచి యువరాజ్ సింగ్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డును కూడా సృష్టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement