Wednesday, May 1, 2024

సీఎం జగన్ ద్వారానే సామాజిక న్యాయం – మంత్రి ఆదిమూల‌పు సురేష్

సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రలో భాగంగా నాలుగోరోజు నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు.అనంతరం పాణ్యం టౌన్ మీదుగా,కాల్వబుగ్గ, నన్నూరు టోల్ గేట్ మీదుగా కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. కర్నూలు జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నన్నూరు టోల్ ప్లాజా దగ్గర మంత్రులకీ ఘన స్వాగతం పలికారు… అనంతరం కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర కర్నూలు నగర ఎమ్యెల్యే, కర్నూలు నగర మేయర్ శ్రీ.బీవై.రామయ్య ఆధ్వర్యంలో బస్సు యాత్ర గా వచ్చిన మంత్రులను ఘనంగా ఆహ్వానించారు. అనంతరం సి-క్యాంప్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేబినెట్ ,నామినేటెడ్ పోస్టుల్లో, ప్రతీ విషయం లో ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనారిటీ లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్య పడిందన్నారు.ఇంతకు ముందు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు 40 సం.ల అనుభవం అనే మాట ఎస్సి,ఎస్టీ,బీసీ, మైనారిటీ లకు చేసిందేమీ లేదన్నారు.తేదేపా చంద్రబాబు నాయుడు కి మతిభ్రమించింది అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల పాలనలో ఏం చేయలేక పోతే, తమ మూడేళ్ల పాలన లోనే జగన్మోహన్రెడ్డి చేసి చూపారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందారు. అందుకే కర్నూల్ అడ్డా వైఎస్ఆర్సిపి గడ్డగా గుమ్మనూరు వర్ణించారు. నేడు 17 మంది ఎస్సి,ఎస్టీ,బీసీ, మైనారిటీ మంత్రులం మీ ముందుకు వచ్చామంటే అది జగనన్న సామాజిక న్యాయం ద్వారానే సాధ్యం అయింది అన్నారు. ఈ విషయము ఏపీ ప్రజలు గమనించాలన్నారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర ను చేస్తున్నాం. ఈసారి కూడా ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని మంత్రులు కోరారు. ఈ కార్యక్రమంలో…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు బాలనాగిరెడ్డి ,జిల్లాలోని ఎమ్యెల్యే లు,ఎంపీలు,మాజీ ఎమ్యెల్యే, మాజీఎంపీ,ఎమ్యెల్సి లు, కర్నూలు జిల్లా నలువైపులా నుంచి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, పలువురు డైరెక్టర్లు,కార్పొరేటర్లు,,జెడ్పిటిసి లు, సర్పంచులు, ఎంపిటిసి లు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement