Monday, April 29, 2024

షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లిన కారు – ఇద్దరు ఉద్యోగుల‌కు గాయాలు

కారు డ్రైవ‌ర్ చేసిన త‌ప్పిదంతో షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ఉద్యోగుల‌కి గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని టెంపే నగరంలో జరిగింది. తెల్ల రంగులో ఉన్న కారు ఆ షాపింగ్‌ మాల్‌ వద్దకు వచ్చింది. డ్రైవర్‌ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్‌పై వేశాడు. దీంతో ఆ కారు షాపింగ్‌ మాల్‌ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లింది. లోపల మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. ఆ షాపింగ్‌ మాల్‌లో వస్తువులున్న కొన్ని ర్యాక్‌లను ధ్వంసం చేసింది. అయితే ఈ ర్యాక్‌ల వల్ల ఆ ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టెంపే నగర పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ ప్రమాదం వల్ల షాపింగ్‌ మాల్‌లోని కొన్ని ర్యాక్‌లు ధ్వంసమయ్యాయని యజమాని చెప్పాడు. ఈ నేపథ్యంలో రిపేర్‌ కోసం కొన్ని రోజుల పాటు షాపింగ్‌ మాల్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement