Friday, May 3, 2024

నేటి యువ‌త‌కు ‘డాల‌రే’ దేవుడు…

వాషింగ్టన్‌ : క్రిస్టియానిటీకి ప్రధాన కేంద్రమైన అమెరికాలో మత జాఢ్యం మాయమవుతోంది. మతంతోపాటు కుటుంబ, సామాజిక విలువలూ క్షీణిస్తున్నాయి. కొత్తతరం ఆలోచనలు సరికొత్తగా ఉంటున్నాయి. చివరకు దేశభక్తినీ వెనక్కి నెట్టేస్తు న్నారు. ప్రాధాన్యత అంశాల్లో ఇప్పుడు డాలరే కొత్త దేవుడైం ది. పిల్లలు, కుటుంబం కంటే కూడా మనీయే ప్రాధాన్య అంశమైంది. ఈ మేరకు తాజా సర్వేలో సంభ్రమాశ్చర్యం కలిగించే సంగతులు వెల్లడయ్యాయి. అమెరికా పౌరుల ఆలోచనల్లో వేగంగా మార్పు వస్తోందని, మత సంప్రదాయా ల చట్రం నుంచి కొత్తతరం బయటకొస్తోందని ఈ సర్వే పేర్కొంది. మరీ ముఖ్యంగా గత పాతికేళ్ల కాలంలో ధోరణులు స్పష్టమైన మార్పులకు గురైనట్లు తెలిపింది. మతం పట్ల విశ్వాసం, అనురక్తి సన్నగిల్లుతున్నదని గతనెల చికాగో యూనివర్సిటీలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, ఎన్‌ఒఆర్‌సిలు నిర్వహిం చిన సర్వే వెల్లడించింది.

మతంతోపాటు, కుటుంబ, సామా జిక విలువల ప్రాధాన్యతలను తెలుకునేందుకు ఈ సర్వే చేపట్టారు. 1000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మతత త్వం, పిల్లల్ని కనడం వంటి నిర్దిష్ట విలువలు క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోయాయని మెజారిటీ పౌరుల స్పందన తెలియజేస్తోంది. అదే సమయంలో డబ్బు ప్రాముఖ్యత పెరిగింది. స్థూలంగా మతం కంటే మనీయే ప్రధానమని సర్వేలో పాల్గొన్న వారు స్పష్టంచేశారు. ఈ సర్వే గతనెల 27న విడుదలైంది. విచిత్రంగా అన్ని వయసుల వారిలోనూ విలువలు, ప్రాధాన్యతల క్రమం మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆందోళన కలిగించే విషయమేమిటంటే తల్లిదండ్రుల జీవితాలు ప్రాధాన్యతాంశాల్లో అట్టడుగుకు రావడం. ప్రపంచ వ్యాప్తంగా క్రమేణా నాస్తికత్వం పెరుగుతోందని ఈ సర్వే పేర్కొంది.

1988 నుంచి 2012 వరకు నాస్తికులు 3 శాతం మందే ఉండగా, ఇప్పుడు వీరిసంఖ్య రెట్టింపై 7 శాతానికి చేరుకున్నట్లు అంచనా వేసింది. ప్రపంచంలో ప్రస్తుతం క్రిస్టియన్లు 220 కోట్లు, ముస్లింలు 160 కోట్లుండగా, మతమే వద్దంటున్న వాళ్లు 110 కోట్లకు చేరారు. మొత్తం జనాభాలో వీరిసంఖ్య 16.3 శాతమన్నమాట. ఇక హిందువుల జనాభా 100 కోట్లు, బౌద్ధులు 50కోట్లుగా ఉన్నది.

సర్వేలోని కీలక అంశాలు..

  • మతం ముఖ్యమనే వాళ్లు కేవలం 39శాతం మాత్రమే. 50శాతం సీనియర్లతో పోల్చితే యువకుల్లో మత విశ్వాసం 31శాతంగా ఉంది. 1998లో ఈ అభిప్రాయం 62శాతంగా ఉండేది. మతపరమైన కార్యక్రమాలకు తామెన్నడూ హాజరవలేదన్న వారి సంఖ్య 31శాతంగా ఉంది. 1988లో ఇది 17శాతం మాత్రమే ఉండేది. ఇక కనీసంగా వారానికొకసారి మతపరమైన సేవలకు హాజరవుతామనే వారు కేవలం 19శాతమే.
  • పిల్లల్ని కనేవిషయంలోనూ అమెరికన్లకు ఆసక్తి సన్నగిల్లుతోంది. సంతానోత్పత్తి తక్కువ ప్రాధాన్య అంశంగా మారింది. ఇలాంటి వారిసంఖ్య 1998లో 59శాతంతో పోల్చితే 2019లో 43శాతానికి తగ్గింది. ఇప్పుడది ఏకంగా 38శాతానికి పడిపోయింది.
  • 43 శాతం మందిలోనే వివాహం పట్ల సదభిప్రాయం ఉంది. మునుపటి సర్వేల్లో ఈ ప్రశ్న అడగలేదు.
  • దేశభక్తి విషయంలోనూ అమెరికన్లు జావగారిపోతున్నారు. 1998లో 70శాతం మంది, 2019లో 61శాతం మంది మాతృభూమికి జైకొట్టారు. ఇప్పుడది ఎకాఎకి 38 శాతానికి తగ్గింది.
  • దేశభక్తి, మతం, వివాహం, సంతానం వంటి విలువలు తగ్గిపోయి, డబ్బే దైవం అనే స్వభావం పెరుగుతోంది. గత పాతికేళ్లలో డబ్బే ప్రధానమనే వారిసంఖ్య 31శాతం నుండి 43శాతానికి పెరిగింది.
  • పార్టీల పరంగాచూస్తే, 53శాతం రిపబ్లికన్లు, 27శాతం డెమొక్రాట్‌లు మతం చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. పిల్లల్ని కనేవిషయంలోనూ రిపబ్లికన్లే ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. 38శాతం రిపబ్లికన్లు, 26 శాతం డెమొక్రాట్‌లు పిల్లలను కలిగి ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు.
  • భవిష్యత్‌ తరాల జీవితం ఇప్పటికంటే మెరుగ్గా ఉంటుందా అనే ప్రశ్నకు నిస్పృహతో కూడిన సమాధానం వచ్చింది. మాకంటే మా పిల్లల తరం బాగుంటుందన్న నమ్మకం లేదని 78శాతం మంది పేర్కొనగా, 21 శాతం మంది ఆశావహంగా కనిపించారు.
  • కమ్యూనిటీ ప్రాముఖ్యానికి 27శాతం మందిమాత్రమే సానుకూలత వ్యక్తంచేశారు. 2019లో 62శాతం, 1998లో, 47శాతం కమ్యూనిటీ ప్రాముఖ్యతకు ఓటేయగా, ఈసారి 27శాతానికి తగ్గింది.
  • కష్టపడే మనస్తత్వం కూడా తగ్గుతోంది. గతసర్వేల్లో 89 శాతం మంది కష్టపడేందుకు సుముఖత వ్యక్తంచేయగా, ఇప్పుడది 67శాతానికి దిగొచ్చింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement