Monday, April 29, 2024

కండోమ్ బదులు జిగురు పదార్థం వాడిన యువకుడు.. మరుసటిరోజే మృతి

గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువకుడు శృంగారంలో జరిపిన ప్రయోగం వల్ల మృత్యువాత పడ్డాడు. తన ప్రేయసితో శృంగారంలో పాల్గొన్న యువకుడు తెల్లారే సరికి మృత్యువై కనిపించాడని పోలీసులు పేర్కొన్నారు. కండోమ్ లేకపోవడంతో జిగురు పదార్థంతో తమ అంతర అవయవాలను దాచుకోవడానికి చేసిన ప్రయోగం విఫలమై యువకుడు మృతి చెందాడు. అహ్మదాబాద్‌లోని ఫతేవాడికి చెందిన సల్మాన్ మీర్జా అనే 25 ఏళ్ళ యువకుడు అతడి గర్ల్ ఫ్రెండ్ మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారు. జూన్ 22న ఈ ఇద్దరూ కలిసి, సెక్సులో పాల్గొనాలనుకున్నారు.

కానీ రక్షణ లేకపోవడంతో గర్భం వస్తుందన్న భయంతో ఏం చేయాలో తెలియక వారి అంతర అవయవాలను దాచుకోవడానికి జిగురు పదార్థాన్ని వాడారు. ఇది జరిగిన మరుసటి రోజే ఆ యువకుడు రోడ్డు మీద పడి కనిపించాడు. అది చూసిన అక్కడి వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత చనిపోయినట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ యువకుడి బంధువులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరీర భాగాల్లోని అంతర అవయవాలకు సంబంధించిన శాంపిల్స్ పరీక్ష చేయడానికి పంపించారు. ప్రస్తుతం ఈ పరీక్ష వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement